Voter List Amendment Campaign: నేటి నుంచి ఓటరు జాబితా సవరణ క్యాంపెయిన్.. యువతకు ఈసీ కీలక సూచనలు..

Voter List Amendment Campaign: ప్రజాస్వామ్య దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఇది ఒక అస్త్రంలాంటిది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం.