‘ట్రాఫిక్ చలాన్లు చెల్లించేవారికి పోలీసులు దసరా కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించారు.. చలాన్లు 50 శాతం రాయితీతో చెల్లించవచ్చు. అక్టోబరు 4 నుంచి 7 వరకు గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాయితీ ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని చెల్లించవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు’అనేది ఆ వార్త సారాంశం.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ వార్త తెగ వైరల్‌గా మారడంతో చాలా మంది ఇది నిజమనే నమ్మారు. తమ వాహనాలపై భారీగా జరిమానాలు ఉన్నవారైతే చాలా రిలీఫ్‌గా ఫీలయ్యారు. ఎలాగైనా అక్టోబర్ 7వ తేదీలోపు చలాన్లు చెల్లిస్తే ఎంచక్కా.. డబ్బులు ఆదా చేసుకోవచ్చని భావించారు. తమ వద్ద డబ్బు లేకపోతే.. స్నేహితుల, బంధువుల వద్ద అప్పు చేసి అయినా సరే గడువు లోగా చలాన్లు చెల్లిస్తే.. ఓ పని అయిపోతుందని అనుకున్నవారు ఉన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
‘హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. గోషామహల్ స్టేడియంలో అక్టోబర్ 4 నుంచి 7 వరకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ మేళాతో మేఘ లోక్ అదాలత్‌ను నిర్వహించబోతున్నారనే ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి డిస్కౌంట్ మేళా నిర్వహించడం లేదు’అని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. (Image-Twitter)