Independence day 2022: తెలంగాణలో కోటి 20లక్షల జాతీయ జెండాల పంపిణి .. 15వ తేదిన ప్రతి ఇంటిపై కనిపించాలని పిలుపు
Independence day 2022: తెలంగాణలో కోటి 20లక్షల జాతీయ జెండాల పంపిణి .. 15వ తేదిన ప్రతి ఇంటిపై కనిపించాలని పిలుపు
Telangana : హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత జాతీయ జెండాలను పంపిణి చేస్తోంది. ఇందులో భాగంగనే కోటి 20లక్షల జాతీయ జెండాలను మంత్రులు, జిల్లా అధికారులు ప్రజలకు అందజేస్తున్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుల భాగంగనే తెలంగాణ ప్రభుత్వం మంగళవారం 1.20 కోట్ల జాతీయ జెండాల పంపిణీని ప్రారంభించింది.
2/ 10
రాష్ట్రంలోని నేత కార్మికులు, పవర్‌లూమ్స్ తయారు చేసిన జెండాల ఉచిత పంపిణీని 33జిల్లాల వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు జెండాల పంపిణిని ప్రారంభించారు. ఆగస్టు 14 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
3/ 10
ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేశారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. మంత్రి స్వయంగా తానే ఇంటింటికీ తిరిగి జెండా విశిష్టతను, ప్రాముఖ్యతను అందరికి వివరించారు.
4/ 10
జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగురవేయాలని ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. అంతకు ముందు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివళులర్పించారు.
5/ 10
ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా రమణి శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
6/ 10
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డులో జాతీయ జెండాల పంపిణి కార్యక్రమం జరిగింది. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జాతీయ జెండాను పంపిణీ చేశారు.
7/ 10
వేడుకల్లో భాగంగా వన మహోత్సవం, ఫ్రీడం రన్, రక్షా బంధన్, రంగోలీ, బాణాసంచా కాల్చడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లుగా మంత్రి తలసాని తెలిపారు.
8/ 10
మహబూబ్ నగర్ మోనప్పగుట్టలో ఉన్న జ్ఞాన భారతి ఉన్నత పాఠశాల వద్ద ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ చేశారు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్. ప్రతి ఇంటికి వెళ్లి జెండాలు అందించారు. దారికి ఇరువైపులా ఉన్న విద్యార్థులకు జెండాలను అందించారు.
9/ 10
75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో గొప్ప విషయమని మంత్రి తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం మనం చూడలేదని కానీ అదే స్పూర్తితో కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం చూశామని తెలిపారు.
10/ 10
తెలంగాణలో మన నేత కార్మికులు తయారు చేసిన సొంత జెండాలు ప్రతి ఇంటికి అందించడం గర్వంగా ఉందన్నారు మంత్రి. మన రాష్ట్రంతో పాటు 22 రాష్ట్రాలకు కూడా తెలంగాణలో నేసిన జెండాలనే అందించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు.