PV Sindhu: మంత్రి రోజాతో పీవీ సింధూ సందడి.. నెట్టింట పిక్స్ వైరల్!
PV Sindhu: మంత్రి రోజాతో పీవీ సింధూ సందడి.. నెట్టింట పిక్స్ వైరల్!
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్-2022 (Commonwealth Games) గేమ్స్ల పీవీ సింధు (PV Sindhu) సంచనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకం సాధించి భారతదేశ కీర్తిపతాకాలను ప్రపంచానికి చాటి చెప్పింది. స్వర్ణం సాధించిన సింధూని మంత్రి రోజా (Minister Roja) కలిశారు.
1/ 6
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్-2022 గేమ్స్ల పీవీ సింధు సంచనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకం సాధించి భారతదేశ కీర్తిపతాకాలను ప్రపంచానికి చాటి చెప్పింది. స్వర్ణం సాధించిన సింధూని మంత్రి రోజా కలిశారు.
2/ 6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఇవాళ కుటుంబ సమేతంగా పీవీ సింధూని కలిశారు. కామన్వెల్త్ 2022 బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించడంపై రోజా నేరుగా కలిసి అభినందించారు. రోజా భర్త సెల్వమణి, కుమారుడు, కుమార్తె కూడా సింధూని కలిశారు.
3/ 6
పీవీ సింధూతో కలిసి రోజా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నొవాటెల్ హోటల్లో లంచ్ చేశారు. అందరూ కలిసి డైనింగ్ హాలులో కూర్చొని మంచి మంచి వంటకాలతో భోజనం చేశారు. ఈ సందర్భంగా సింధూ సెల్ఫీ తీసింది.
4/ 6
లంచ్ అనంతరం మంత్రి రోజా, సింధూ అక్కడున్న వారితో కలిసి సరదాగా సెల్ఫీ దిగింది. ఈ సందర్భంగా సింధూ తనకు వచ్చిన పతకాలను మంత్రికి చూయించారు. ఈ సందర్భంగా అందరూ సరదా సరదాగా గడిపారు.
5/ 6
రోజా కుమార్తె అన్షు మాలికి సింధూతో ప్రత్యేకంగా ఫొటో దిగింది. అన్షు మాలికి త్వరలోనే సినిమాల్లోకి రానుంది. ఇప్పటికే డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్‌లోనూ ట్రెయినింగ్ అయిన అన్షుమాలికిని హీరోయిన్ చేయడానికి రోజా రెడీ అయ్యారు. తెలుగులోనే కాకుండా తమిళ దర్శకులతోనే సంప్రదింపులు చేస్తున్నారు.
6/ 6
కామన్వెల్త్ 2022లో బంగారు పతకం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సహకారానికి సింధు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.