Minister KTR: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యూపీ మెట్రో అభివృద్ధికి నిధులు ఇచ్చే మోదీ సర్కార్ హైదరాబాద్ మెట్రోకు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యూపీ మెట్రో అభివృద్ధికి నిధులు ఇచ్చే మోదీ సర్కార్ హైదరాబాద్ మెట్రోకు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. (Pc: Twitter/@MinisterKTR
2/ 7
మెట్రోకు నిధులు ఇవ్వాలని ఎన్నో సార్లు లేఖ రాసిన కూడా ప్రయోజనం లేకుండా పోయిందని..హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఆరోపణలు చేశారు. (Pc: Twitter/@MinisterKTR - BRS)
3/ 7
ఈ సందర్బంగా ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కేంద్రం సహకరించినా..సహకరించకపోయినా కూడా వచ్చే 3 ఏళ్లలో ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. (Pc: Twitter/@MinisterKTR - BRS)
4/ 7
ఇక హైదరాబాద్ అభివృద్ధి రోజురోజుకు పెరుగుతుందని..యూఎస్ లోని నగరాలను హైదరాబాద్ తలపిస్తుందని మంత్రి అన్నారు. (Pc: Twitter/Dr Ranjith Reddy - BRS)
5/ 7
తన ఫ్రెండ్ ఒకతను 16 ఏళ్ల తరువాత హైదరాబాద్ వచ్చాడని..అతను హైదరాబాద్ ను కెనడాలా తలపిస్తుందని అన్నాడని కేటీఆర్ గుర్తు చేశారు. (Pc: Twitter/Dr Ranjith Reddy - BRS)
6/ 7
హైదరాబాద్ కు అతి పెద్ద వరం మూసి అని..నగర రూపురేఖలు అభివృద్ధితో పూర్తిగా మారిపోయాయని అన్నారు. (Pc: Twitter/Dr Ranjith Reddy - BRS)
7/ 7
ఈరోజు హైదరాబాద్ లోని ఖాజాగూడలో కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. (Pc: Twitter/Dr Ranjith Reddy - BRS)