గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు. ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తిచేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. .(Photo:Twitter)
రాబోయే మూడేండ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకు వస్తున్నట్లుగా చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి చేసేది ఇంకా ఉందని.. కానీ చేసింది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. కొత్తగూడ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో కొండాపూర్,గచ్చిబౌలి వాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినట్లుగా మంత్రి తెలిపారు.(Photo:Twitter)
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ముఖ్యంగా ఐటీ కారీడార్, బిజినెస్ డిస్ట్రిక్ట్ని లింక్ చేస్తూ ఉన్న ప్రాంతాల వాసులకు ట్రాఫిక్ సమస్య తొలగిపోయి ప్రయోజనం పొందుతారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు..ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు పరిసర ప్రాంతాలను కలుపుతుంది.(Photo:Twitter)
కొత్తగూడ ఫ్లైఓవర్ వల్ల బొటానికల్ గార్డెన్, కొత్తగూడ జంక్షన్లలో నూటి నూరు శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమవడంతో పాటుగా కొండాపూర్ జంక్షన్లో 65శాతం రద్దీ తగ్గనుంది. గడిచిన ఎనిదేళ్ల కాలంలో నగరంలో చాలా ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణం పనులు మొదలుపెట్టిన నాటి నుంచి ప్రారంభం వరకు యుద్ధప్రాతిపదిన వంతెన నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది. (Photo:Twitter)