E Motor Show: హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!
E Motor Show: హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!
హైదరాబాద్‌లో ఈ మోటార్ షోను కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు ఎక్కువుగా ఎలక్ట్రిక్ వాహనాలే తయారుచేయడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ మోటార్ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ షోలో పాల్గొన్న పలు స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఇ-మోటర్ షో 2023ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీలన్నీ ఈ షోలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
2/ 6
ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలు ఎక్కువుగా ఎలక్ట్రిక్ వాహనాలే తయారుచేయడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ మోటార్ షోను ప్రారంభించిన మంత్రి ఈ షోలో పాల్గొన్న పలు స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు.
3/ 6
యంగా బైక్ లు, ఆటోలు, కార్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోందని, దాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలే భవిష్యత్తులో మనగలుగుతాయని చెప్పారు మంత్రి కేటీఆర్.
4/ 6
హైదరాబాద్ ఈ మోటార్ షోలో దేశీయ కంపెనీల ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఇది మొదటి అడుగుమాత్రమే.. రానున్న రోజుల్లో ఈ రంగం అభివృద్ధి మరింతగా చెందుతుందన్నారు.
5/ 6
ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీ అమర్ రాజా సంస్థ ఇప్పటికే తమ వస్తువులను తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు ప్రకటించామన్నారు. నగరంలో ఈవీ వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ చేయనున్నారు.
6/ 6
హైదరాబాద్ ఈ మోటార్ షోలో దేశీయ కంపెనీల ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ రంగ అభివృద్ధి మరింతగా చెందుతుంది. హైదరాబాద్‌లో ఈవీ వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ చేస్తామన్నారు కేటీఆర్.