Metro Suicide : మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్య ... ! హైదరాబాద్‌లో ఘటన
Metro Suicide : మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్య ... ! హైదరాబాద్‌లో ఘటన
Metro Suicide : మెట్రో స్టేషన్ నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ పై నుండి దూకడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌పై నుండి ఓ వ్యక్తి దూకి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గురువారం సాయంత్రం దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్నుండి ఓ గుర్తు తెలియని వ్యక్తి స్టేషన్ మెట్లపై నుండి పైకి ఎక్కి దూకినట్టు పోలీసులు తెలిపారు.
2/ 7
అయితే సాయంత్రం వేళ కావడంతో హుటాహుటిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే భాదితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
3/ 7
బాధితుడి కుటంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే ఆత్మహత్యకు గల కారణాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.
4/ 7
కాగా మెట్రో నిర్మాణం తర్వాత ఓ వ్యక్తి స్టేషన్ పై నుండి దూకడం ఇది మొదటి సారి కావడంతో కలకలం రేగుతోంది. రానున్న రోజుల్లో మెట్రో స్టేషన్లు సూసైడ్ కేంద్రాలుగా మారనున్నాయా అనే సందేహాన్ని నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
5/ 7
మరోవైపు హైదరాబాద్‌లో మరో యువతిపై అత్యాచారం జరిగింది. బంజారాహిల్స్‌లో పని చేసే ఓ యువతిని తనతోపాటు పని చేసే వ్యక్తి బలవంతం చేశాడని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో యువతి కేసు ఫిర్యాదు చేసింది
6/ 7
కాగా ఆ యువతి గత ఇరవై రోజుల క్రితమే విల్లాలో పనికి చేరినట్టు తెలిపింది. సర్వెంట్ క్వార్టర్‌లోనే ఉంటుంది. అదే విల్లాలో పని చేసే శివ అనే వంటపని చేసే వ్యక్తి ఆమెను బలవంతం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటన గత గురువారం జరిగినట్టు తెలిపింది.
7/ 7
అయితే భయంతో గత వారం రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తన సోదరుడు ఆమె వద్దకు చేరుకున్న తర్వాత విషయం చెప్పిన తర్వాత ఆయన సహాయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కోంది.పోలీసులు ఫిర్యాదు తీసుకుని అత్యాచారంతో పాటు బెదిరింపు కేసులను నమోదు చేశారు.