రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 సెలవుల జాబితాను ప్రకటించింది. ఏ నెలలో ఏఏ సందర్భంగా బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉంటాయో వెల్లడించింది. రీజియన్ల వారీగా సెలవుల జాబితాను ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది. హైదరాబాద్ రీజియన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకులకు ఫిబ్రవరిలో 6 సెలవులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ , బ్యాంక్ హాలిడేస్ 2023 ఆంధ్రప్రదేశ్, బ్యాంక్ హాలిడేస్ 2023 , బ్యాంక్ హాలిడేస్ జనవరి 2023" width="1200" height="800" /> 6. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, నెట్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ లాంటి సేవల్ని వాడుకోవచ్చు. ఈ సేవలు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంకులకు సెలవుల వివరాలను (RBI) అధికారిక వెబ్సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లో తెలుసుకోవచ్చు. ఈ లింక్లో సర్కిల్స్ వారీగా సెలవుల జాబితా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని బ్యాంకుల సెలవుల వివరాలు తెలుసుకోవాలంటే హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేసి, నెల సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)