గడిచిన 68 ఏళ్లుగా ఖైరతాబాద్ లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. మొదట ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని 1954లో ప్రతిష్ట చేశారు. అలా.. 2014 వరకు ఏటా ఒక అంగుళం పెంచుకుంటూ 60 ఫీట్ల అత్యంత ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని నిర్మిస్తూ వచ్చారు. పర్యావరణ వేత్తల సూచనలు, తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆ తర్వాత ఎత్తు తగ్గిస్తూ వచ్చారు.