Telangana:కేఏ పాల్ వెంట ఉండే జ్యోతికి త్వరలోనే పెళ్లి..అతనితోనే జరుగుతుందంటున్న సన్నిహితులు
Telangana:కేఏ పాల్ వెంట ఉండే జ్యోతికి త్వరలోనే పెళ్లి..అతనితోనే జరుగుతుందంటున్న సన్నిహితులు
Telangana|KA Paul:ఆమె ఎవరూ..? ఏ ప్రాంతానికి చెందిన యువతి..? ఆ మత ప్రభోధకుడికి ఏమౌతుంది..? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో హాట్ టాపిక్‌గా సాగిన చర్చ ఇప్పుడు తెలంగాణలో మొదలైంది.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. ఆయనే కాదు..ఆయన వెంట ఉండే జ్యోతి అనే యువతి కూడా అందరికి తెలుసు.
2/ 15
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో కేఏపాల్‌పై దాడి జరిగిన సమయంలో జ్యోతి స్పందించడంతో అందరి దృష్టి ఆమెవైపు మళ్లింది. 2019 ఎన్నికల్లో ఏపీలో కేఏపాల్ బరిలో ఉన్నప్పుడు కూడా జ్యోతి గురించి చర్చ జరిగింది.
3/ 15
ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలు పరిశీలిస్తు ఉండేవారు జ్యోతి. ఇప్పుడు కేఏ పాల్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఆయనపై దాడి జరిగింది. ఈకార్యక్రమంలోనే జ్యోతి స్పందించడంతో మళ్లీ ఈమె ఎవరూ అనే టాపిక్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
4/ 15
గతంలో జ్యోతి ఎవరూ అనే ప్రస్తావన రావడంతో కేఏపాల్ స్వయంగా స్పందించారు. ఆమె తనకు కాబోయే కోడలని పలుమార్లు మీడియా ముందే ప్రకటించారు. ఏపీ పాలిటిక్స్ నుంచి కేఏ పాల్ తెలంగాణకు షిప్ట్ కావడంతో ఆయనతో పాటు జ్యోతి టాపిక్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నోటెడ్ అయింది.
5/ 15
దీంతో ఆమె అసలు ఎవరూ ..? ఏ ప్రాంతానికి చెందిన వాళ్లనే ఆసక్తికరమైన విషయాలను కొన్నింటిని న్యూస్18 రాబట్టింది. కేఏ పాల్ వెంట కనిపిస్తూ ఉండే యువతి పేరు జ్యోతి. అసలు పేరు జ్యోతి బెగల్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి చిన్నప్పుడే కరాటే మర్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం పొందారు.
6/ 15
అలాగే దైవపరమైన కార్యక్రమాలంటే జ్యోతికి చాలా మక్కువ. ఆ కారణంతో పాల్ కుటుంబంతో సన్నిహిత్యం ఏర్పడింది. జ్యోతికి కేఏ పాల్ కుమారుడు కిల్లారి జాన్పాల్కి అమెరికాలోనే పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది.
7/ 15
కేఏ పాల్కి ముగ్గురు సంతానం, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయిపోయింది. మిగిలింది కొడుకు ఒక్కరే. అతని పేరే కిల్లారి జాన్‌పాల్. అమెరికాలో ఉంటున్నారు. జ్యోతి కంటే జాన్‌పాల్ ఐదేళ్లు చిన్నవాడు.
8/ 15
అయినప్పటికి ఇద్దరూ ప్రేమించుకోవడంతో ఇరు కుటుంబల్లో పెద్దలు కూడ వీరి ప్రేమ వ్యవహారికి ఓకే చెప్పారు. కేఏ పాల్ తనయుడు కిల్లరి జాన్‌పాల్‌తో జ్యోతి వివాహం చేయడానికి రెడీ ఉన్నట్లు గతంలోనే సంకేతాలు ఇచ్చారు.
9/ 15
జ్యోతి 2017 వరకు అమెరికాలోనే ఉన్నారు. 2019లో పాల్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె పాల్ వెంట ఉండటం, మీడియా సమావేశాల్లో కనిపించడంతో అందరూ జ్యోతి ఎవరూ అనే ప్రశ్నలను సందిస్తూ వచ్చారు.
10/ 15
తన కాబోయే కోడలని కేఏ పాల్ చెప్పడంతో అంతా లైట్ తీసుకున్నారు. రీసెంట్గా పాల్‌పై తెలంగాణలో దాడి జరగడం దానిపై జ్యోతి స్పందించడంతో మళ్లీ ఆమె ఎవరూ అనే చర్చ నడుస్తోంది.
11/ 15
రాజకీయాల ప్రస్తావన పక్కనపెడితే రాబోయే మూడేళ్లలో జ్యోతికి కేఏ పాల్ కుమారుడు జాన్పాల్కి వివాహం జరుగుతుందని సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరీ పెళ్లి చేయాలని పాల్ కూడా డిసైడ్ అయ్యారట.
12/ 15
జ్యోతి, జాన్‌పాల్ ఇద్దరూ తమ వయసు 30ఏళ్లు దాటిన తర్వాతే చేసుకుంటామని చెప్పడంతో వివాహం వాయిదా పడిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
13/ 15
ఆల్రెడీ పెళ్లి చేయడానికి కేఏ పాల్ సిద్ధయ్యారు కాబట్టి వాళ్లు ఎప్పుడంటే అప్పుడు వివాహం జరిపించాలనే ఆలోచనలో ఉన్నారట కేఏ పాల్.
14/ 15
కోవిడ్ కారణంగా గతేడాది జ్యోతి తల్లి, అమ్మమ్మను కోల్పోయారు. అందుకే ప్రస్తుతం కేఏ పాల్‌తో ఇండియాలోనే ఉంటున్నారు. త్వరలో పాల్ కుమారుడు జాన్ పాల్ ఇండియాకు రాగానే వెకేషన్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
15/ 15
కేేఏ పాల్ కుమారుడితో వివాహం జరిగితే జ్యోతి తెలుగు రాష్ట్రాల్లో రాజీకాయ వ్యవహారాల్లో మామయ్యకు సపోర్ట్‌గా ఉంటారా లేక ఆయన కుమారుడు కిల్లరి జాన్‌పాల్‌తో అమెరికా వెళ్లిపోతారో చూడాలి.