Secunderabad: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు..!
Secunderabad: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు..!
Secunderabad-Hyderabad Vande Bharat train: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలకు తొలి దశ కింద ఇటీవలే ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరయింది. అది తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖ మధ్య పరుగులు పెడుతోంది. కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనూ గమ్యస్థానానికి చేరుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ సెమీ హైస్పీడ్ రైలులో చార్జీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. తక్కువ ప్రయాణ సమయం.. ఎక్కువ సౌకర్యాలు ఉండడంతో.. ప్రయాణికులు రాజీ పడుతున్నారు. అచ్చం విమాన ప్రయాణం చేసినట్లుగా ఉండడంతో.. వందేభారత్‌కు ఆదరణ పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి స్మార్ట్ సిటీలైన బెంగళూరు, పుణె రూట్లలో రైళ్లను నడపనున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపితే.. ప్రయాణికుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఆ రైలు వెళ్లే స్పీడుకి కేవలం 8 గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు 75, రాబోయే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)