Hyderabad: ఐపీఎల్ ఫ్యాన్స్కి శుభవార్త.. ఆదివారం ఉప్పల్ రూట్లో మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
Hyderabad: ఐపీఎల్ ఫ్యాన్స్కి శుభవార్త.. ఆదివారం ఉప్పల్ రూట్లో మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
Hyderabad: ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్లో ఐపీఎల్ సందడి షురూ అయింది. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరుగుతుండడంతో.. ఉప్పల్ స్టేడియానికి కొత్త కళ వచ్చింది. మూడేళ్ల తర్వాత.. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఆదివారం మధ్యాహ్నం 03:30కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. పెద్ద ఎత్తున ప్రేక్షుకులు తరలిరానుండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. ప్రేక్షకుల రద్దీ దృష్ట్యా నాగోల్-అమీర్పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి... నాగోల్-అమీర్పేట్ మార్గంలో అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. మ్యాచ్ నేపథ్యంలో అటు పోలీసులు కూడా పటిష్ట బందో ఏర్పాటు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ సారి ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు మ్యాచ్లు జరగనున్నాయి. ఏప్రిల్ 2న రాజస్థాన్, ఏప్రిల్ 9న పంజాబ్, ఏప్రిల్ 18న ముంబై జట్లతో రాజీవ్ గాంధీ స్టేడియంలో హైదరాబాద్ జట్టు తలపడనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఆ తర్వాత ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే4 కోల్కతా నైట్ రైడర్స్, మే 13న లక్నో సూపర్ జెయింట్స్, మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను హైదరాబాద్ స్టేడియంలో ఢీకొట్టనుంది సన్ రైజర్స్ టీమ్. (ప్రతీకాత్మక చిత్రం)