హైదరాబాద్లో మెట్రో రైలు వచ్చాక..ట్రాఫిక్ కష్టాలు కొంతలో కొంత వరకైనా తగ్గాయి. నిత్యం వేలాది మంది ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పోల్చితే... చార్జీలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ట్రాఫిక్ సమస్య లేకపోవడం.. త్వరగా గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉండడంతో... చాలా మంది మెట్రోలో వెళ్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ రూ.13 వేల కోట్లు ఖర్చు చేసింది. బ్యాంకుల కన్షార్షియం నుంచి రుణం తీసుకొని.. మెట్రో నిర్మాణం చేపట్టింది. ఐతే లాక్డౌన్ వల్ల నష్టం రావడంతో.. వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కమర్షియల్ లోన్లను ఎల్ అండ్ టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి.. వడ్డీని 9 శాతం నుంచి 6.5శాతానికి తగ్గించుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)