హైదరాబాద్ (Hyderabad)లో ఇప్పుడున్న మెట్రో ఆకాశమార్గంలో ఉన్నాయి. కానీ తొలిసారిగా అండర్‌గ్రౌండ్‌లో రైళ్లు నడవనున్నాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 31 కి.మీ. మార్గంలో..27.5 కి.మీ. ఆకాశమార్గంలో ఉంటుంది.1 కి.మీ. భూమార్గంలో అంటే.. రోడ్డు లెవెల్లో వెళ్తుంది. మరో 2.5 కి.మీ. మాత్రం అండర్ గ్రౌండ్లో ఉంటుంది.
అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తారు. ఈ మార్గంలో 9 స్టేషన్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో స్కైవాకర్స్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సిటీ మెట్రో 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్నాయి. కానీ ఎయిర్పోర్ట్ మెట్రో (Airport Metro) రైల్ గరిష్టంగా 120 కిలో మీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు.