2. రైతులకు పెట్టుబడి సాయం అందించడమే పీఎం కిసాన్ పథకం లక్ష్యం. ప్రతీ ఏటా మూడు ఇన్స్టాల్మెంట్స్లో రూ.6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ప్రతీ ఇన్స్టాల్మెంట్లో రూ.2,000 చొప్పున అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 12 ఇన్స్టాల్మెంట్స్ను రైతుల అకౌంట్లలో జమ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక పీఎం కిసాన్ డబ్బుల్ని పొందడానికి ఇకేవైసీని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. పీఎం కిసాన్ ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తోంది. గతంలో పీఎం కిసాన్ ఇకేవైసీ చేయడానికి చివరి తేదీ ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊరట కలిగిస్తూ చివరి తేదీని తొలగించింది. రైతులు ఎప్పుడైనా ఇకేవైసీ పూర్తి చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)