M Balakrishna, Andhra Pradesh, News18. Good News: మధుమేహం ఇది ఇప్పుడు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా దాదాపు అందర్ని వేదిస్తోన్న ప్రధాన ఆరోగ్య సమస్య.. అయితే అన్ని రోగాల కంటే ఈ మధుమేహాం అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన పరిక్షలు చేసుకోకపోతే వచ్చే అనార్ధాలు చాలానే ఉన్నాయి.
మధుమేహవ్యాధిగ్రస్తులు ఎంతో కొంత నొప్పి భరించాల్సి వస్తోంది. అయితే సరిగ్గా ఇదే సమస్యను నివారించడానికి హైదరాబాద్ కు చెందిన ఒక యువతి, యువకుడు ఒక వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. రక్త సేకరణతో సంబంధం లేకుండా అసలు నొప్పి లేకుండా శరీరంలో ఉన్న చక్కెర స్థాయిని తెలుసుకునే స్మార్ట్ డివైజ్ ను రూపోందించారు ఈ యువ జంట.
దీంతోపాటు వీళ్లు రూపోందించిన ఈ డివైజ్ చాలా చవకైనది, నొప్పిలేకుండా ప్లగ్-అండ్-ప్లే గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. VivaLyf ఇన్నోవేషన్స్, లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు సీఈవో పీయూష్ బన్సల్ షార్క్ ట్యాంక్ ఇండియాపై పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడ అనుపమ్ మిట్టల్ వీళ్లు రూపోందించిన స్మార్ట్ డివేజ్ పై పెట్టుబడులు పెట్టారంటే మన వాళ్ల ఐడియా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వీళ్లు రూపోందించిన EzLyf పరికరం పెన్ డ్రైవ్ అంత చిన్నది. దీన్నిమన స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసి, యాప్‌ని తెరిచి, స్క్రీన్‌పై మీ వేలిని ఉంచాలి. నియర్-ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (NIR) ద్వారా మన రక్తంలో ఉన్న గ్లోకోజ్ స్థాయి మన తెలుసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పని చేసే ఈ డివేజ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం 60 సెకన్లలో మీ రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయి చూపిస్తుందని వర్షిత, విమల్ కుమార్ డివైజ్ రూపకర్తలు చెబుతున్నారు.
తాను చాలా చిన్న వయస్సులోనే టైప్ 1 డయాబెటిస్ కి గురైయ్యాను అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను రోజుకు కనీసం మూడు నుండి నాలుగు సార్లు పరీక్షించుకోవాలని వైద్యులు చెప్పారు. ఒక్కో గ్లూకోమీటర్ స్ట్రిప్ ధర దాదాపు రూ. 40, మధుమేహం వ్యాధికి చెక్ పెట్టేందుకు ప్రతిరోజూ దాదాపు రూ.160 మరియు నెలకు దాదాపు రూ.4,800 ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో దినికి ఎదైన పరిష్కారం చూడాలి అని ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియానే ఇది అంటున్నారు.
తాము రూపోందించిన డివైజ్ తో క్షణాల్లో మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకోవచ్చు అది కూడా ప్రతి సారి డబ్బులు చెల్లించే పని లేకుండా ఒంటిపై ఎటువంటి సూదులతో పోడిచే పని లేకుండా అని వర్షిత, విమల్ కుమార్ న్యూస్ 18 కి తెలిపారు. ఈ జంటకు పలు అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం వీళ్లు రూపోందించిన డివైజ్ స్టార్టప్ ఎంపవర్-2021, యాక్సిలరేటింగ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ పోటీలో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్‌లో జరిగిన టై ఉమెన్ గ్లోబల్ పిచ్-2021లో విజేతగా నిలిచింది.
ఈ జంట NITTE హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ హ్యాకథాన్‌ను కూడా గెలుచుకున్నారు. నీతి ఆయోగ్ 2021లో మొదటి తొమ్మిది కాబోయే హెల్త్‌కేర్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది వీళ్ల ఇన్నోవేషన్. ప్రస్తుతం, వీళ్లు రూపోందించిన ఈ పరికరం ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో వచ్చే ఆరు నుండి ఎనిమిది నెలల్లో మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దపడుతున్నారు..