HYDERABAD GOLD AND SILVER PRICES ARE STABLE TODAY COMPARED TO YESTERDAY SNR
Gold Preice:గుడ్ న్యూస్..నిన్నటితో పోలిస్తే స్థిరంగానే గోల్డ్, సిల్వర్ ధరలు
Gold, Silver Price: గత 10 రోజులుగా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి.
భారత్‌లో పసిడి ధర పరుగులు పెడుతోంది. శుభకార్యాలు, పెళ్లి ముహుర్తాలు పెద్దగా లేకపోయినప్పటికి వినియోగదారులు అత్యధికంగా గోల్డ్ పర్చేజ్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత 10రోజుల సరాసరి గోల్డ్ రేటు పరిశీలిస్తే పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
2/ 11
ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న పరిణామాలు, ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధంతో పాటు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బంగారాన్ని కొనుగోళ్లనే ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు.
3/ 11
వన్ఇండియా గుడ్‌రిటర్న్స్ పాలకుల ప్రయోజనాలు కోసం సమాచారంగా భారత్‌లో బంగారం ధరలను అందిస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
4/ 11
ముఖ్యంగా భారత్‌లో ఇవాళ 22క్యారెట్ గ్రాము బంగారం ధర 4,980రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్‌లో 22క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర 49,840రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే గోల్డ్ రేట్ పెరగలేదు.
5/ 11
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర 50,200 ఉంటే 24క్యారెట్స్ గోల్డ్ 10గ్రాములు 54,770కి చేరుకుంది. దేశ రాజధాని ముంబైలో కూడా 22క్యారెట్స్ గోల్డ 10గ్రాముల ధర 49,800 ఉంటే న్యూఢిల్లీలో 49,800కోల్‌కతా, బెంగుళూరు, కేరళ ఒకే ధరను కలిగి ఉంది.
6/ 11
పూణెలో గోల్డ్ ధర కాస్త పెరిగింది. 22క్యారెట్స్ గోల్డ్ 10గ్రాముల ధర 49,830రూపాయలుగా ఉంది. బరోడాలో 49,850అహ్మదాబాద్‌లో 49,950, జైపూర్‌లో అదే ధర పలుకుతోంది.
7/ 11
గడిచిన 10రోజులుగా బంగారం ధరలో హెచ్చు తగ్గులు చూసుకుంటే ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో 22క్యారెట్స్ గోల్డ్ 10గ్రాముల ధర 49,800 ఉంటే ఇవాళ కూడా అదే రేటు కంటిన్యూ అవుతోంది.
8/ 11
చెన్నై, ముంబై, న్యూ ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో కూడా 10రోజుల సరాసరి గోల్డ్ రేట్ స్థిరంగానే ఉంటోంది. మార్చి 1వ తేదిన మాత్రమే 22క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర గణనీయంగా తగ్గింది.
9/ 11
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, కేరళలో తులం వెండి ధర రూ.700 గా ఉంది. చెన్నైలో రూ.686కి చేరింది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, బరోడాలో రూ.640కి లభిస్తోంది.
10/ 11
హైదరాబాద్‌లో ఇవాళ వెండి ధర గ్రాము 77.6రూపాయలు ఉండగా కిలో సిల్వర్ బార్ 77,600రూపాయలుగా ఉంది. నిన్న సిల్వర్ రేటు గ్రాముకు 77.6 సిల్వర్ బార్ ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు.
11/ 11
భారత్‌లో బంగారానికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే వివాహ సందర్భాలు, పుట్టిన రోజు వేడుకలు, మతపరమైన పండుగల్లో ప్రజలు ఎక్కవగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ నివేదికలో ప్రచూరించింది.