హైదరాబాద్ లో పర్యాట ప్రదేశం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్.. అందులో బుద్ధుడి విగ్రహం..నాలుగు వైపులా ఉండే ప్రదేశాలు చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు విచ్చేస్తుంటారు. దానికి దగ్గరల్లో ఉన్న నెక్లెస్ రోడ్డుకు ఎంతో మంది పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. (Image credit : Youtube)
పర్యాటకులను ఆకర్షించేందుకు ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తాజాగ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ భారీ సైజులో ఉన్న బాటిల్ అందర్నీ ఆకర్షిస్తోంది. పర్యాటకులు వచ్చినప్పుడు కాలక్షేపం కోసం స్నాక్స్ లాంటివి తింటూ ఉంటారు. (Image credit : Youtube)