HYDERABAD GHMC HEALTH OFFICIALS CONDUCTED FEVER SURVEY IN 137869 HOUSES OF HYDERABAD AK
హైదరాబాద్‌లో చురుగ్గా కొనసాగుతున్న ఫీవర్ సర్వే.. కొత్తగా 1,37,869 ఇళ్లలో..
GHMC Fever Survey: జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌కు కేవలం కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు వచ్చిన ఫోన్ కాల్స్‌కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు.
కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 1563 బృందాలు ఆదివారం ఇంటింటికి తిరిగి ఫివర్ సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఆదివారం సెలవు అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆదనపు బృందాలతో సర్వే నిర్వహించారు. ఒక్కో బృందంలో ఒక ఏ.ఎం.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి నేడు 1,37,869 ఇళ్లలో సర్వేను చేపట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ బృందాలు జ్వరంతో బాధ పడుతున్నవారి వివరాలను సేకరించి, జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటి లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు. .(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇప్పటివరకు మొత్తం 8,38,970 ఇళ్లలో సర్వే నిర్వహించారు. నగరంలో ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర ఆస్పత్రుల్లో అవుట్ పేషంట్ కు జ్వర పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
నేడు అన్ని ఆసుపత్రుల్లో 5396 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల ద్వారా మొత్తం 1,93,900 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. .(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌కు కేవలం కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు వచ్చిన ఫోన్ కాల్స్‌కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు.(ప్రతీకాత్మక చిత్రం)