GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేయడం ఎప్పుడూ ఉండేదే. ఈసారి ఆ రెండు పార్టీలకూ గట్టి పోటీ ఇస్తూ... బీజేపీ ధూమ్ ధామ్ ప్రచారం చేస్తోంది. ఢిల్లీ నుంచి అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను ప్రచార రంగంలోకి దింపడం విశేషం. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే... GHMC ఎన్నికలు చిన్నవే అయినప్పటికీ... ప్రతీ ఎన్నికనూ సీరియస్గా తీసుకుంటోంది కమలదళం.