దేశంలోనే హైదరాబాద్‌లో మొదటి సారిగా హుస్సేన్ సాగర పరిసరాల్లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (స్ట్రీట్ రేసింగ్) మొదటి రోజు ఉత్సాహంగా జరిగింది. ఈ లీగ్‌లో ఆరు జట్లు.. 24 మంది రేసర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ఇండియన్ రేసింగ్ లీగ్ కొనసాగింది.(Photo Credit:Twitter)
భారత్‌లో నిర్వహిస్తున్న తొలి స్ట్రీట్ సర్క్యూట్ కాగా.. ఇందులో హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. రేస్‌లో మొత్తం 24 మంది జాతీయ, అంతర్జాతీయ రేసర్లు పాల్గొనగా.. హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్ రేసింగ్‌లను చూసేందుకు వచ్చిన అభిమానులు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లను చూసి కేరింతలు కొట్టారు.(Photo Credit:Twitter)
ఫిబ్రవరి 11వ తేదిన జరిగే ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు చూసేందుకు అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచారు. ఒక రోజు టికెట్ ధర 700 ఉండగా ...రెండ్రోజుల రేసింగ్ టికెట్ ధర 12వందల రూపాయలకుపైగా నిర్ణయించారు. ఆన్లైన్లో ఈ కార్ రేస్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆదివారం చివరి రోజు కావడంతో ఎక్కువ మంది ఈ పోటీలను తిలకించే అవకాశం ఉంది.(Photo Credit:Twitter)
ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న రేస్ కార్లు చూసి, వాటితో ఫొటోలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్మార్గ్, హుస్సేన్ సాగర్ పరిసరాలు యువతతో సందడిగా కన్పించాయి. శనివారం మధ్యాహ్నం తొలి లీగ్‌లో భాగంగా ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ ఉన్న ట్రాక్ వెంట ఫార్ములా కార్లు పరుగులు తీశాయి. (Photo Credit:Twitter)