రియాద్ నుంచి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌కు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆటో విడిభాగాలకు చెందిన 83 బాక్స్‌లతో కూడిన కార్గో విమానాన్ని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్లాట్ల వద్ద నిలిపారు. వాటిని అన్లోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి.. జీహెచ్ఏఆర్ టెర్మినల్ లోపలికి తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ ఈ-ప్రిక్స్ నేపథ్యంలో.. ఈ నెల 7 నుంచి 12 వరకు పూర్తిగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మళ్లింపుల కారణంగా ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ చౌరస్తా, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
కాగా, ఫార్ములా ఈ రేసింగ్ 2014 లో మొదటిసారిగా బీజింగ్ లో ఒలింపిక్ పార్క్‌లో నిర్వహించారు. అప్పటినుంచి ఫార్ములా ఈ రేసింగ్.. గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ బ్రాండ్ గాఎదిగింది. ప్రస్తుతం ఈ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. 250 కెవి పవర్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)