తెలంగాణలో వైన్ షాప్‌లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరచుకొని ఉంటాయి. బోనాల పండగ, హోలీ, గాంధీ జయంతి వంటి సందర్భాల్లో మాత్రమే షాపులు మూతపడతాయి. మిగతా సమయాల్లో తెరచుకునే ఉంటాయి. కానీ వీటితో సంబంధం లేకుండా.. 24 గంటల పాటు మద్యం దొరికే లిక్కర్ స్టోర్ ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటయింది. (ప్రతీకాత్మక చిత్రం)
24 గంటల పాటు తెరచుకొని ఉండే పబ్బు, మైక్రో బ్రూవరీ హైదరాబాద్‌కి వచ్చేసింది. పగలు రాత్రి.. సెలవు దినాలనే తేడా లేదు. అక్కడ ఎప్పుడూ మద్యం దొరుకుతోంది. ఉదయం 6 గంటలకు వెళ్లినా.. అర్ధరాత్రి 1 గంట తర్వాత వెళ్లినా.. ఓపెన్ చేసే ఉంటుంది. అదే బార్లీ అండ్ గ్రేప్స్ పబ్. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎయిరోప్లాజలో ఇది ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే ఒక్కో బాటిల్‌పై పది రూపాయలు తగ్గించిన ప్రభుత్వం ... ఇప్పుడు మరో 20 రూపాయలు తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధరలను తగ్గిస్తే మద్యం డిపోల్లో పేరుకుపోయిన పాత స్టాక్ క్లియర్ అవుతుందని, వేసవి ప్రారంభమైనందున మద్యం అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)