Fire Accident : నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పార్కింగ్‌లో ఉన్న ఓ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్పటివరకూ బాగానే ఉన్న ఆ కారు నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు రావడంతో.. స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎలక్ట్రికల్ కార్ నుంచి మంటలు వ్యాపించినట్లుగా సమాచారం అందుతోంది. ఒక కారు నుంచి వచ్చిన మంటలు వేగంగా.. మరో నాలుగు కార్లకు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు మిగతా కార్లకు అంటుకొని పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. మంటల్లో కాలిపోతున్న వాహనాల్ని చూసి స్థానికులు పరుగులు పెట్టారు. మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు." width="225" height="403" /> కొంతమంది ఆ దృశ్యాలను తమ మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది వేగంగా మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఏమాత్రం ఆలస్యం అయినా కార్లు పేలిపోయి ఉండేవని స్థానికులు అంటున్నారు. మొత్తానికి మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.