ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్బంగా మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు పొడిగిస్తున్నట్టు తెలిపారు.
2/ 7
ఒంటి గంటకు చివరి మెట్రో రైలు స్టార్ట్ కాగా 2 గంటలకు చివరి స్టేషన్ కు చేరుకుంటుందని తెలిపారు. అయితే మందబాబులు మెట్రోలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
3/ 7
కాగా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండగా న్యూ ఇయర్ సందర్బంగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని మరో 3 గంటలు అదనంగా పెంచారు.
4/ 7
కొత్త సంవత్సరం సందర్బంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని మెట్రో పని వేళల సమయాన్ని పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మెట్రో నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
5/ 7
ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్-19 కంటే ముందు రోజుకు 5 లక్షల మంది ప్రయాణించేవారు. కానీ ఇప్పుడా సంఖ్య బాగా తగ్గింది.
6/ 7
ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ వస్తే.. నగరంలోని మెట్రో మార్గాల సంఖ్య నాలుగుకి చేరుతుంది.
7/ 7
హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన మెట్రోకు మరో జాతీయ అవార్డు లభించింది. ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకున్న మెట్రో ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే ఈసారి మెట్రో నిర్మాణం, ఇతర అంశాలకు సంబంధించి ఫోటో ఆల్బమ్ కు ఈ జాతీయ అవార్డు దక్కింది.