తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాలల్లో నూతన డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. (తెలంగాణ ప్రభుత్వ లోగో)
తెలంగాణ సర్కార్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది . అయితే మంజూరు చేసిన అన్ని కళాశాలలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాక అయిన … ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మంజూరు పై ఆయా స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (సబితా ఇంద్రారెడ్డి, కేసీఆర్(File))
కాగా ఇటీవలే నారాయణ పేట జిల్లాలో 2 మండలాలు… వికారాబాద్ జిల్లాలో ఒక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, పరిగి, మహేశ్వరం, ఉప్పల్లో ఈ నూతన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. (మంత్రి సబితా ఇంద్రారెడ్డి(file))