Coronavirus: మళ్లీ కరోనా కల్లోలం... హైదరాబాద్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Coronavirus: మళ్లీ కరోనా కల్లోలం... హైదరాబాద్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Coronavirus: కరోనా పీడ విరగడయిందనుకున్నాం. కానీ మళ్లీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. అందులోనూ హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు వేసవిలో కూడా కోవిడ్ కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 54 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధిక కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
బుధవారం ఒక్క హైదరాబాద్ సిటీలోనే 40 కేసుల వరకు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 1.09గా ఉన్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
రాష్ట్రంలో చాలా మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ (ఇన్ఫ్లూయెంజా) కలకలం రేపుతోంది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. "హాంకాంగ్ ఫ్లూ" అని కూడా పిలువబడే H3N2 వైరస్ వల్ల చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే నలుగురు మరణించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
వైరల్ ఫ్లూ సోకిన వారిలో సాధారణంగా జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ముక్కు కారటం, కళ్ల నుంచి నీరు కారడం, తలనొప్పి లేదా తల భారంగా ఉండటం, అలసట, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కొన్ని సందర్భాల్లో అతిసారం బారినపడే అవకాశం ఉంది. పిల్లలకు అయితే సాధారణ లక్షణాలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్లాలి.(ప్రతీకాత్మక చిత్రం)