ఒమిక్రాన్ కేసులు తేలిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని టోలీచౌక్ మొత్తం ఒకే క్లస్టర్‌గా నిర్బంధం చేశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పారమౌంట్ కాలనీని పోలీసులు, వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కూడా శాంపిల్స్ పంపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా విదేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులను వేగవంతం చేశారు. దీనిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. బాధితుడి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ చేసి టెస్టులు చేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి మొదట్లో ఎలాంటి భయానక వాతావరణం నెలకొందో ప్రస్తుతం ఇక్కడి ప్రాంతంలో కూడా అంతే తయారైంది. (ప్రతీకాత్మక చిత్రం)