గొర్రెల పంపిణీ పథకం ద్వారా తెలంగాణలో మాంసం ఉత్పత్తులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంతో రాష్ట్రంలో మాంసం వినియోగాన్ని పెంచేందుకు మటన్ క్యాంటీన్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.