Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీనా..మజాకానా..మరో అరుదైన గుర్తింపు..అదేంటంటే?
Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీనా..మజాకానా..మరో అరుదైన గుర్తింపు..అదేంటంటే?
హైదరాబాద్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో బిర్యానీ కూడా ఒకటి. భాగ్యనగరానికి వచ్చి చార్మినార్, ట్యాంక్ బండ్ చూడకుండా ఎలాగైతే వెళ్లరో అలాగే బిర్యానిని ఓ పట్టు పట్టకుండా వదిలి పెట్టరనడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా హైదరాబాద్ బిర్యానీకి అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో బిర్యానీ కూడా ఒకటి. భాగ్యనగరానికి వచ్చి చార్మినార్, ట్యాంక్ బండ్ చూడకుండా ఎలాగైతే వెళ్లరో అలాగే బిర్యానిని ఓ పట్టు పట్టకుండా వదిలి పెట్టరనడంలో అతిశయోక్తి లేదు.
2/ 8
ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చిన వారు అత్యంత ఇష్టంగా ఈ బిర్యానిని ఆరగిస్తారు. అంతలా హైదరాబాద్ బిర్యానికి ప్రాధాన్యత ఉంది. ఇక తాజాగా ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికలో బిర్యానీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.
3/ 8
'హెల్తీ ఫుడ్ గా హైదరాబాద్ బిర్యానీ గుర్తింపు పొందగా ఇది ఆరోగ్యకరమైందని పరిశోధనలో తేలింది. హైదరాబాద్ బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, కూరగాయలు వాడడం వల్ల ఆరోగ్యవంతంగా తయారు అవుతుందని నివేదికలో పేర్కొంది.
4/ 8
అలాగే బిర్యానీలో వాడే పసుపు, నల్ల మిరియాలు జీర్ణక్రియకు, జీలకర్ర ఎండుమిర్చి, కుంకుమ పువ్వు, పసుపు, అల్లం, వెల్లుల్లి యాంటీ యాక్సిడెంట్లు కావడం ఆరోగ్యానికి మంచిదని అధ్యనంలో తేలింది.
5/ 8
ఇక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ బిర్యానీ రుచి కోసం మాత్రమే కాకుండా అందులో వుండే సల్ఫర్ సమ్మేళనాలు, మెగ్నీషియం, విటమిన్ B6, విటమిన్ సీలు అధికంగా ఉంటాయి. అందువల్ల రుచితో పాటు ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది.
6/ 8
సాధారణంగా తెలంగాణలో ఉప్పు, కారం ఎక్కువగానే తింటారు. అలాగే బిర్యానీ కూడా స్పైసీగా ఉంటేనే చాలా మంది ఇష్టపడతారు. ఇక మనం వాడే ఇంగ్రిడియెంట్స్ మన ఆరోగ్యానికి దోహదపడతాయి.
7/ 8
హైదరాబాద్ లో అర్ధరాత్రి అయినా కూడా బిర్యానీ సెంటర్లు కళకళలాడుతుంటాయి. అంతలా నాన్ వెజ్ ప్రియులు బిర్యానీని ఇష్టపడతారు. ఫ్రెండ్స్ తో, బంధువులతో, కుటుంబంతో కలిసి బిర్యానీని ఆరగిస్తే ఆ కిక్కే వేరప్పా.
8/ 8
ఇక బ్యాచిలర్లు వంట చేసుకోలేక బిర్యానీ వైపే మొగ్గు చూపుతారు. ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఇలా ఎక్కడైన బిర్యానీ ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. పైగా ఫుడ్ డెలివరీ సదుపాయంతో బిర్యానీని తినే వారి సంఖ్య కూడా పెరిగింది.