తెలుగు ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 5 షో ఈ వారమే ప్రారంభమవుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు తొలి ఎపిసోడ్ స్టార్ మాలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు అంతా క్వారంటైన్ లోకి వెళ్లారు.. అక్కడ కూడా సందడి చేస్తూనే ఉన్నారు. అయితే బిగ్ బాస్ 5కు సంబంధించి కంటెస్టెంట్స్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. దానికి కారణం ఎంటో తెలుసా..?
బిగ్ బాస్ హౌస్ కు వెళ్తున్నవారికి కరోనా వచ్చింది అన్నది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక కంటెస్టెంట్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో మరో పేరు తెరపైకి వచ్చింది. అలాగే కంటెస్టెంట్స్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో.. ఇద్దరు తమ ఫ్యామిలీ డాక్టర్లను పిలిపించుకుని టెస్టులు చేయించుకున్నారు. అలా వచ్చిన డాక్టర్ వారితో సెల్ఫీ దిగడంతో మ్యాటర్ లీక్ అయ్యింది. దీంతో మరో ఇద్దరిని కూడా మార్చారు. దీంతో మొత్తం మూడూ మార్పులు చోటు చేసుకున్నాయి .
కొత్త గా జాబితాలో చేరింది ఎవరంటే.. దీపక్ సరోజ్ ప్లేస్ లో టీవీ నటుడు విశ్వ, కార్తీక దీపం విలన్ శోభాషెట్టి (మోనిత) ప్లేస్ లో అదే సిరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ ఉమా వస్తున్నారు. అలాగే ఇషా చావ్లా ప్లేస్ లో అనీ మాస్టర్ కొత్త జాబితాలో చేరారు. అలాగే వీరితో పాటు సింగర్ కేటగిరిలో శ్రీరామ చంద్ర కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే హౌస్ మేట్స్ ను నాగార్జున పరిచయం చేసే సమయంలో ఎవరు ఏ పాటకు డ్యాన్స్ వేశారు అన్నది కూడా లీక్ అయ్యింది. నటుడు మానస్ షా.. పవన్ కళ్యాణ్ పాట ఆరడగుల బుల్లెట్ సాంగ్ కు డ్యాన్స్ వేసినట్టు తెలుస్తోంది. నటరాజ్ మాస్టర్ పుష్ఫా సాంగ్ కు, యాంకర్ రవి సరైనోడి పాటకు, లోబో పాగల్ సినిమా పాటకు, షన్ముఖ్ జస్వంత్ నేనొక్కడినేలో వూఆర్ యూ పాటకు, లహరీ షారీ అర్జున్ రెడ్డి పాటకు, సిరీ హనుమంత్ బూమ్ బద్దల్ పాటకు, అనీ మాస్టర్ తెలుసా తెలుసా పాటకు, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గోపికమ్మ పాటకు , శ్వేతా వర్మ ధీవర పాటతో మన ముందుకు వస్తారని తెలుస్తోంది.