బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన భువనగిరి ఎస్వోటీ పోలీసులు.. మంగళవారం ఉదయం బ్రాహ్మణపల్లిలో పాల వ్యాపారి తూపెల్లి బాల్రెడ్డి ఇంటికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ పాల కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు.(ప్రతీకాత్మక చిత్రం)
రైతుల నుంచి సేకరించిన పాలతో పాటు డాల్ఫర్ ఫ్రెష్, స్కీమ్డ్ మిల్క్పౌడర్తో తయారు చేసిన కల్తీ పాలు లభ్యమయ్యాయి. దాదాపు 200 లీటర్ల కల్తీపాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల డాల్ఫర్ ఫ్రెష్ స్కీమ్డ్ మిల్క్పౌడర్తో పాటు పాలను తరలించేందుకు వాడే వాహనాన్ని సీజ్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
నిందితుడు బాల్ రెడ్డి గత 15 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. స్థానికంగా పాలు సేకరించి.. వాటిని హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఉప్పల్, మేడిపల్లి పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. ఐతే ఇటీవల పాల దిగుబడి తగ్గడంతో.. పాలల్లో మిల్క్పౌడర్, ఇతర రసాయనాలు కలిపి ఎక్కువ పాలను తయారు చేస్తున్నాడు.(ప్రతీకాత్మక చిత్రం)