సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు నాలుగు రైలు మార్గాలు ఉన్నాయి. 1. సికింద్రాబాద్-కర్నూల్- గుత్తి- కడప-తిరుపతి. 2. సికింద్రాబాద్-నల్గొండ-నడికుడి-గుంటూరు-నెల్లూరు-తిరుపతి, 3. సికింద్రాబాద్-వరంగల్-విజయవాడ-నెల్లూరు-తిరుపతి. 4. సికింద్రాబాద్-వికారాబాద్-రాయిచూర్-గుంతకల్-కడప-తిరుపతి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందులో సికింద్రాబాద్-విజయవాడ-నెల్లూరు-తిరుపతి మార్గంలో ఈ వందే భారత్ రైలును నడపనున్నట్లు తెలుస్తోంది. ట్రయల్ రన్ కూడా ఈ మార్గంలోనే సాగుతోంది. ఆదివారం చెన్నై నుంచి వచ్చిన వందే భారత్ రైలు.. గూడూరుకు రాత్రి 2 గంటలకు చేరుకుంది. ఒంగోలుకు ఉదయం 5.20, చీరాలకి 6.25, విజయవాడకు 8.25కి చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)