ఎక్కువమంది చదివినవి
మరింత చదవండి MLA Rajasingh: మారని ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు..మరో కేసు నమోదు
MLA Rajasingh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీస్ కేసులు వీడడం లేదు. మొన్నటికి మొన్న ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయగా..తాజాగా హైదరాబాద్ లో మరో కేసు నమోదు అయింది. శ్రీరామనవమి సందర్బంగా ఏర్పాటు చేసిన శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కొడుకును పరిచయం చేస్తూ ఓ మతంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.