దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ రాష్ట్రాల్లో అధికారిక లెక్కల ప్రకారం నమోదైన క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ. ముఖ్యంగా క్యాన్సర్ కారక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 13వస్థానానికి చేరుకుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 19రాష్ట్రాల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లతో పాటు పలు రాష్ట్రాల్లో బెరిటరీ క్యాన్సర్ కేర్ సెంటర్స్ ద్వారా చికిత్స చేస్తున్నారు. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో కలిపి క్యాన్సర్ బాధితుల సంఖ్య 14లక్షల 61వేల427కేసులు ఉన్నాయి. ఇందులో ఐదున్నర లక్షల కేసులు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషంగా చూడాలి.(ప్రతీకాత్మకచిత్రం)
ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో మహరాష్ట్ర ఉంది. మూడో స్థానంలో వెస్ట్ బెంగాల్, నాల్గో రాష్ట్రంగా బీహార్,తర్వాత తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. అయితే టాప్ టెన్ స్టేట్స్లో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం విశేషంగా చూడాలి. (ప్రతీకాత్మకచిత్రం)