తెలంగాణలో ఉపద్రవం ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓవైపు భారీ వర్షసూచన ఉందని వాతావరణకేంద్రం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లుగా కనిపిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రస్తుతం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎవరికి వాళ్లు వ్యక్తిగత శుభ్రత, భద్రత పాటిస్తేనే గతంలో జరిగిన ప్రమాదకరమైన పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వెయ్యికి చేరువ అవుతున్న పాజిటివ్ కేసులను ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తేనే మంచిదంటున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)