Huzurabd ByElections: హుజూరాబాద్‌లో ఈటల దూకుడు..రేపటి నుంచే పాదయాత్ర.. ఎన్ని రోజులంటే...
Huzurabd ByElections: హుజూరాబాద్‌లో ఈటల దూకుడు..రేపటి నుంచే పాదయాత్ర.. ఎన్ని రోజులంటే...
Huzurabad ByElections 2021: హుజురాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు రోజు రోజుకూ వేడెకుతున్నాయి. మిగతా పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలో ఉంటే.. బీజేపీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌తో పాటు ఆయన సతీమణి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఊరూరా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.
1/ 7
జులై 19 నుంచి హుజూరాబాద్‌లో బీజేపీ ప్రచారం మరింతగా హోరెత్తనుంది. రేపటి నుంచి నియోజకవర్గ పరిధిలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పాదయాత్ర వివరాలను వెల్లడించారు ఈటల.
2/ 7
అందరికీ అనుక్షణం అండగా ఉండడానికి.. ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి.. 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుండి శ్రీకారం చుడుతున్నానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
3/ 7
సోమవారం ఉదయం 7.30 ని.లకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానంలో ఈటల పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారు.
4/ 7
ఈ ప్రజా పాదయాత్రకి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. నా అడుగులకు మీ అండదండలు కావాలని.. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలని అన్నారు.
5/ 7
మరోవైపు హుజూరాబాద్‌లో ఈటలకు బదులు ఆయన సతీమణి జమున పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని .. ఈ ఉప ఎన్నికలో తాను కూడా బరిలో నిలిచే అవకాశం ఉందనే విధంగా వ్యాఖ్యలు చేశారు.
6/ 7
ఈటల రాజేందర్ బరిలో ఉన్న.. తాను పోటీ చేసినా ఒక్కటేనని జమున అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ఈటలకు దూరంగా ఉండి.. భార్యను బరిలోకి దింపుతారా? అని హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
7/ 7
మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనే బలమైన నేతల కోసం వారు అన్వేషిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశముంది.