Telangana: కొత్త బార్లకు దరఖాస్తుల వెల్లువ.. ఒక్క బార్ కే 277 అప్లికేషన్లు.. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట..
Telangana: కొత్త బార్లకు దరఖాస్తుల వెల్లువ.. ఒక్క బార్ కే 277 అప్లికేషన్లు.. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట..
New Bars In Telangana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. నూతన బార్లకు సోమవారం చివరితేదీ కావడంతో వేలాదిగా ఔత్సాహికులు వీటిని అప్లై చేసుకున్నారు. 153 బార్లకు గానూ 7 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా నూతన బార్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఔత్సాహికులు వాటి పర్మిషన్ కోసం ఎగబడ్డారు. కొత్తగా 153 బార్ల ఏర్పాటుకు అనుమతులు రావడంతో.. వాటికోసం 7,360 దరఖాస్తులు వచ్చాయి.
2/ 5
దరఖాస్తులకు సోమవారం చివరి రోజు కావడంతో నిన్న ఒక్కరోజే 5,311 అప్లికేషన్లు రావడం గమనార్హం. శనివారం వరకు వచ్చిన దరఖాస్తులు 2,050 మాత్రమే. ఉన్నట్టుండి నిన్న ఒక్కరోజే 5 వేలకు పైగా దరఖాస్తులు రావడం విశేషం.
3/ 5
అత్యధికంగా యాదగిరి గుట్టలో ఒక్క బార్ కు ఏకంగా 277 దరఖాస్తులు వచ్చాయి. ఇక సూర్యపేటలోని నేరేడ్ చర్ల లోని బార్ కు 249 అప్లికేషన్లు వచ్చాయి. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న 6 బార్లకు 638 అప్లికేషన్లు రావడం గమనార్హం.
4/ 5
ఇదిలాఉంటే.. ఖమ్మం జిల్లాలోని వైరాలో రెండు బార్లకు 346 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా నిజామాబాద్ లోని ఏడు బార్లకు ఏడు దరఖాస్తులు, బోధన్ లోని మూడు బార్లకు మూడే దరఖాస్తులు వచ్చాయి. అయితే వ్యాపారులు సిండికేట్ అయ్యే ఇలా చేశారని అబ్కారీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
5/ 5
ఇక జీహెచ్ఎంసీ పరిదిలోని 55 బార్లకు 1,053 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ. 70 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తున్నది. ఈనెల 10న ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో బార్ల లైసెన్సుదారుల ఎంపిక జరగనుంది.