తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై హిమా కొహ్లితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ హిమా కోహ్లి బదిలీపై తెలంగాణ సిజెగా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన హిమా కోహ్లికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.