తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్ర చరిత్రలోనే గురువారం తొలిసారిగా అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు అయిందని విద్యుత్ అధికారులు తెలిపారు. గురువారం 11.01 నిమిషాలకు 15,497 మెగావాట్ల విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ గా నమోదయ్యిందని ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.