తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావచ్చని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
రానున్న మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిన్న జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
మరోవైపు.. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
తెలంగాణలో ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చేశాయి. నైరుతి రుతుపవన మెఘాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.ఈ కారణం వలనే తెలంగాణలో మే చివరి వారం నుంచే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం ప్రారంభించాయి.
7/ 8
జూన్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి, ఆదిలాబాద్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో కూడా వర్షం భీభత్సం సృష్టించింది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ ఏడాది ఇప్పటి వరకు ఖమ్మం వాతావరణ కేంద్రంలో 91 మి.మీ, రామగుండం స్టేషన్లో 88 మి.మీ వర్షం కురిసింది. జూన్ 1 నుంచి మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 22 జిల్లాల్లో లోటు వర్షపాతం, ఒక జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది.