వర్షాలు తగ్గిన తర్వాత ఉల్లిని తవ్వాలని మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి వెంకటేష్ చెబుతున్నారు. ఇప్పటికే తవ్వి ఉంటే ఇంట్లో షెడ్లు కుప్పలుగా పోయకుండా ఆరబెట్టు కోవాలని సూచించారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న మామిడి తోటలను నష్టపరిహారంగా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమయం కాని సమయంలో కురుస్తూ.. తెలుగు రాష్ట్రాల రైతుల కళ్లలో కడగండ్లయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మూడ్రోజులుగా ఏపీ, తెలంగాణల్లోని కొన్నిప్రాంతాలు భారీ వర్షాల్లో తడిసి ముద్దవుతున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడుతుండటంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వడగండ్ల వాన ఎలా పడుతుంది ? అసలు ఆకాశంలో నుంచి మంచుగడ్డలు వానలా ఎలా కురుస్తాయి ? వాటిని తింటే ఏమవుతుంది ? ఇలాంటి చాలామందికి ఇలాంటి సందేహాలున్నాయి. వడగండ్ల వాన.. దీనిని వాతావరణ పరిభాషలో ఘన వర్షపాతం అంటారు. క్యుములో నింబస్ మేఘాలలో సూపర్ కూలెడ్ నీటి బిందువులు కలయిక వలన మేఘాల మధ్య పొరలలో ఏర్పడుతాయి. వడగండ్ల వాన పడటం అనేది.. అప్పటి వాతావరణ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.