రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన..అతలాకుతలమైన జనం
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన..అతలాకుతలమైన జనం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కందికట్కూర్, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, కోహెడ మండలంలో భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి, మాదాపురం, ముల్కలపల్లిలో తీవ్ర వడగండ్ల వాన పడింది.