200 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టారు. డిస్కులు ఫుడ్ బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, కబడ్డీ, టెన్నిస్ క్రీడలతో పాటు టాయిలెట్స్ పార్కింగ్ టైల్స్ పక్కగా ప్రహరీ నిర్మాణం తో పాటు పచ్చని అహ్లదాకరమైన వాతావరణం కల్పించేలా చెట్లు నాటి ప్రత్యేక హంగులతో పాఠశాల నూతన భవనాన్ని నిర్మించారు.
అయితే ఈ భవనాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎంజెఆర్ ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ స్కూల్ ఆ ప్రాంతంలో అనేకమంది పిల్లల బంగారు భవిష్యత్‌కు పునాది వేసేలా ఉండేందుకు కృషి చేస్తున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు.