ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రక్రియయను వెంటనే అమలు చేయాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ ను 57 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఓల్డేజ్ పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నది. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును తగ్గించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)