కాగా చోరీ చేసిన నగలను చింతల్బస్తిలోని ఓ వ్యాపారికి విక్రయించినట్టు యువతి ఒప్పుకుంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్కు తరలించినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. మొత్తం మీద మరచిపోయిన నగలు మూడు రోజుల తర్వాత గుర్తుకు వచ్చినా.. తిరిగి ఆమె నగలు లభించడంతో సదరు మహిళ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది..