తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. 2014లోనే సఫాయి సిబ్బంది జీతాలను పెంచించిందని ఆయన గుర్తు చేశారు. రూ. 8,500గా ఉన్న వారి జీతాన్ని.. రూ. 12,500కి పెంచినట్లు వెల్లడించారు. ఆ తర్వాత రూ. 14,500కు పెంచామని తెలిపారు మంత్రి కేటీఆర్.