హైదరాబాద్‌లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా డెంగీ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో దోమలపై యుద్ధం ప్రకటించింది జీహెచ్ఎంసీ. డెంగీ నిర్మూలన కోసం దోమలను తరిమికొట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో కొత్తగా ఆయిల్ బాల్ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు అధికారులు.
గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా నగరంలోని చెరువుల్లో దోమల నిర్మూలనకు ఆయిల్ బాల్ ప్రయోగాన్ని జిహెచ్ఎంసి చేపట్టింది.
2/ 10
నగరంలోని ఇతర జోన్లలో డ్రోన్ల వాడకంపై నిషేదం ఉన్నందున ఈ చెరువుల్లో దోమల నివారణకు పలు ప్రయత్నాలను జిహెచ్ఎంసి ఎంటమాలజి విభాగం చేపట్టింది.
3/ 10
ఎల్బీనగర్ జోన్ లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు, నాగోల్ చెరువు, బండ్లగూడ చెరువు, అయ్యప్ప కాలనీ నాలా తదితర చెరువుల్లో ఆయిల్ బాల్స్ ను వేశారు.
4/ 10
ఈ ఆయిల్ బాల్స్ ద్వారా చెరువు నీటిపై ఆయిల్ తెట్ట పర్చుకొని దోమల నివారణ, లార్వా అభివృద్ది పూర్తిగా నిలిచి తద్వారా దోమల నివారణ జరుగుతుంది.
5/ 10
ముందుగా గోనె సంచిని చిన్న చిన్న ముక్కలుచేసి దానిలో రంపపు పొట్టువేసి బంతిలాగా తయ్యారు చేస్తారు.
6/ 10
ఈ బంతిని మస్కిటో లార్వా సీడల్ ఆయిల్ (ఎం.ఎల్.ఓ) కలిగిన డ్రమ్‌లో 24గంటలకు పైగా నానబెట్టిన అనంతరం ఆ బాల్స్ ను తీసి చెరువుల్లో, కుంటల్లో వేస్తారు.
7/ 10
ఆయిల్ బాల్స్ ద్వారా ఎం.ఎల్.ఓ ఆయిల్ తెట్ట పల్చగా నీటిపై పర్చుకొని దానిపై ఉన్న దోమ, లార్వాలు చనిపోయి దోమ ఉత్పత్తి లేకుండా చేస్తుంది.
8/ 10
ఈ విధానంతో సత్ఫలితాలు లభిస్తున్నందున నగరంలోని అన్ని చెరువులు, కుంటల్లో విస్తృతంగా ఆయిల్ బాల్స్ ను వేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.
9/ 10
గణేష్ నిమజ్జనాలకు ప్రత్యేకంగా నిర్మించిన 28 కొలనుల్లో లార్వా నివారణకు జీహెచ్ఎంసీ ఇప్పటికే గంబూసియా చేపలను వదిలిన విషయం తెలిసిందే.
10/ 10
దోమల నివారణ కోసం ఇంటి ఆవరణలోని తొట్టెలు, కూలర్లతో పాటు గుంతల్లో నీరు నిల్వకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు.