జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు గాను.. 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయింది. ఇక నేరెడ్మెట్ ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున నిలిపేశారు. హైకోర్టు తీర్పు తర్వాతే ఆ ఫలితాన్ని ప్రకటించే అవకాశముంది.